Wednesday, November 5, 2008

ఒక భారతీయుడి ఆవేదన

ఒక మామూలు నాయకుడి సభ జరిగితే త్రొక్కిసలాట ,ఎందరికో గాయాలు , ప్రతి పక్షాల మీద బురద
ఇవి అన్ని లేని సభ ఎక్కడైనా జరిగినట్టు విన్నామా, కాని జరిగింది అది ఇండియా లో అని అనుకొంటే పప్పులో కాలేసి నట్టే , అది జరిగింది ఇండియా కంటే అన్ని రంగాలలో పెద్దదైన అమెరికాలో జరిగింది అదీ మామూలు నాయకుడి సభ కాదు, ఒక దేశధక్షుడి విజయ ప్రసంగం లో.
ఒక మామూలు సభలో జరగలేనిది ఒక దేశధక్షుడి సభలో జరిగింది , ఇది వారికే ఎందుకు సాధ్యపడింది మనకు ఎందుకు సాధ్యపడలేదు అని ప్రతీ భారతీయుడు ఆలోచించాలి .

ఒక ఎం ఎల్ ఏ , ఒక ఎం పీ , ఒక సి ఎం గెలిస్తే ప్రతిపక్షాల నాయకులూ ఎంత మంది హర్షిస్తారు , ఒక్కరు హర్షించరు, ఓటమి పాలు ఐన ప్రతి పక్ష నాయకుడి అదే సభలో ఆ అధ్యక్షుడిని ఆలింగనం చేసుకోవడం ఏ దేశం లో జరుగుతుంది , అమెరికాలో జరుగుతుంది జరిగింది కూడా .

ప్రక్క పార్టీ సభకి ఎంతమంది జనాభా వచ్చారు , వారి కంటే ఎక్కువ మందిని ఎలా తరలించాలి అని ఆలోచించే మన నాయకులు, ఒక్కసారి ఐన ఆ పార్టీ మీటింగ్ లో ఎంత మంది గాయపడ్డారు , ఇక్కడ అస్సలు ఎవ్వరూ గాయపడకుండా చూడాలి అని ఎవరు ఆలోచిస్తారు అలా ఆలోచిస్తే అది ఇండియా ఎందుకు అవుతుంది .
ఒకే రోజు రెండు వేర్వేరు దేశాలలో జరిగిన సభలలో వ్యత్యాసం ....
ఒకటి మామూలు సభ మరొకటి దేశదక్ష వుపన్యాసం , రెండింటికీ ఒకటే జనం
కాని ఇక్కడ త్రొక్కిసలాట అక్కడ ప్రశాంతం ....
ఎందుకింత తేడా , తేడా దేశాలలో కాదు , నాయకులలో కాదు మనలోనే వుంది .
అన్నింటిలో పోటీ పడుతున్న మనం ఈ ఒక్కదానిలో ఎందుకు పోటీ పడలేక పోతున్నాం అని ఒక్కరైన ఆలోచించారా ,
వారిలో వున్నది మనలో లేనిది ఒక్క క్రమశిక్షణ ,
ఆ క్రమశిక్షనే మన సొంతమైనపుడు అమెరికా కాదు ప్రపంచమే మన పాదాక్రాంతం అవుతుంది .






No comments: